బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు...
07-05-2026 03:47 PM
బాన్సువాడ, మే 7 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాల లో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామ యువకులు స్పందించి గోశాలకు పశుగ్రాసం సహాయం అందించారు.బీర్కూర్ గ్రామానికి చెందిన గోసేవ దాతలు పిట్లం అశోక్ (బంగారం), శశికాంత్ కలిసి సుమారు రూ.25 వేల విలువైన 350 గడ్డి కట్టలను బోధన్ ఏక చక్రేశ్వర గోశాలకు పంపించారు.ఈ సేవా కార్యక్రమంలో గోసేవకులు సితలే రమేష్, శశికాంత్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్‌తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గోశాలకు అవసర సమయంలో సహాయం అందించిన దాతలను గోసేవకులు అభినందించారు.






