28 June, 2026 | 2:51 AM

‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్ అరెస్ట్

28-06-2026 01:44 AM
  1. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని రూ.32 లక్షలు వసూలు
  2. బాధితుడు డబ్బు అడిగితే రివర్స్ కేసు..
  3. నిందితుడికి 14 రోజుల రిమాండ్  

ముషీరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మిం చి రూ.32 లక్షలు మోసం చేసిన కేసులో పాతబస్తీకి చెందిన పల్లపు సురేష్ కుమార్ అలియాస్ ‘గోల్డ్ మెన్’ సూర్యభాయ్‌ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణగూడ ఇన్ స్పెక్టర్ సైదే శ్వర్ ఈ విషయాన్ని వెల్లడించారు. హయత్‌నగర్‌కు చెందిన గోల్డ్స్మిత్ కృష్ణ చారిని సూర్య భాయ్ తక్కువ ధరకే బంగారం అందిస్తానని నమ్మించాడని తెలిపారు.

ఈ క్రమం లో హిమాయత్‌నగర్‌లోని ఓ కేఫ్‌లో బాధితుడి నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత బంగా రం ఇవ్వకపోవడంతో పాటు నగదు కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్య భాయ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి నిందితుడిని చెంచ ల్ గూడ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇదిలా ఉండగా, సూర్య భాయ్‌పై గతంలో మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. ఆ కేసులో ఇద్దరి మధ్య వివాదాన్ని సెటిల్ చేస్తానని చెప్పి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.తన క్లయింట్ సూర్యపై కావాలనే కుట్రలు జరుగుతున్నాయని సూర్య భాయ్ తరఫు న్యాయవాది కిషన్ ఆరోపించారు.

బాధితులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఇటీవల సూర్య భాయ్ నివాసానికి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అలాగే, సంబంధిత వ్యక్తులకు సూర్య భాయ్ రూ.20 లక్షల చెక్కును అందజేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. సూర్య భా య్పు ఉద్దేశపూర్వకంగానే చీటింగ్ కేసు నమో దు చేశారని కిషన్ ఆరోపించారు.