7 May, 2026 | 4:42 PM

ప్రతి గ్రామంలోనూ కిషోర బాలికల సంఘాలు

07-05-2026 03:46 PM

నంగునూరు, (విజయక్రాంతి): ప్రతి గ్రామంలో 14 నుంచి18 ఏళ్ల బాలికలతో ‘కిషోర బాలికల సంఘాలు’ఏర్పాటు చేయాలని ఏపీఎం శ్రీనివాస్  కోరారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన కన్వర్జెన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పది మంది సభ్యులతో కూడిన ఈ సంఘాల ద్వారా బాలికలకు ఆరోగ్యం,పోషకాహారం,సైబర్ క్రైమ్,బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.వారిలో నాయకత్వ లక్షణాలు,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్నేహ సమ్మర్ క్యాలెండర్’ను ప్రవేశపెట్టిందని, దీనిని అధికారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ అలీ, డాక్టర్ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ సంపత్,ఐసీడీఎస్ రజిత,మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.