ఫార్మా సిటీ మారదు
- అక్కడి భూములపై మాకు స్పష్టమైన విధానం ఉంది
- ‘రియల్’దందా చేస్తే చట్టం ఒప్పుకోదు.. బీఆర్‌ఎస్ ఊరుకోదు
- సీఎం రేవంత్‌రెడ్డి మాటలు వింటే నష్టపోతరు
- భూములు గుంజుకోవడమే ఆయన పని
- రాష్ట్రంలో రేవంత్ ఫ్యూచర్‌కే దిక్కులేదు
- కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం
- మేఘాలయ ముఖ్యమంత్రి మెచ్చుకున్నరు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : ఫార్మాసిటీ భూములపై బీఆర్ఎస్‌కు స్పష్టమైన విధానం ఉందని, ఆనా డు భూసేకరణ కేవలం ఫార్మాసిటీ కోస మే జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అక్కడ జూ పార్క్ పెడుతాం, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం, రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, మా అల్లుడికి, తమ్ముడికి ఇంత ఇస్తా. అంటే చట్టం ఒప్పుకోదు.. బీఆర్‌ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం రేవంత్ తీసుకొచ్చే వాళ్లంతా చట్టాన్ని చూడకుండా ఇష్టానుసారంగా పోతే నష్టపో తారని తెలిపారు.
ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరిట విలువైన భూములపై పడి ముఖ్యమంత్రి అన్నాదమ్ములు దోచుకుంటున్న రని ఆరోపించారు. ఈ ప్రాంతంపై ప్రేమ తో ఇక్కడి బిడ్డలకు కొలువులు రావాలనే కేసీఆర్ ఫార్మా సిటీ తీసుకొచ్చారని, ప్రపంచస్థాయిలో కాలుష్యం లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో లిక్విడ్ డిస్‌ఛార్జ్‌తో నిర్మించాలని సంకల్పించారని గుర్తు చేశారు. 5 లక్షల మందికి ఉద్యో గాలు వచ్చే విధంగా హైదరాబాద్ ఫార్మాసిటీకి ఏడేళ్లు కష్టపడి ప్రణాళికలు రచిం చారని, రైతులను మెప్పించి ఒప్పించి 14 వేల ఎకరాలను మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో సేకరించామని పేర్కొన్నారు.
కరో నా వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు హైదరాబాదే ప్రపంచానికి ఏకైక దిక్కు కావాలని అనుకున్నామని తెలిపారు. గతంలో రేవంత్‌రెడ్డి మేం అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేస్తామన్నారని, నాడు కాంగ్రెస్ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టారని గుర్తు చేశారు. ఫార్మా సిటీ రద్దుచేసి, ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామని, ఇప్పుడు ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదు అని ఇప్పుడు మాట మార్చారని విమరించారు. రెండున్నరేళ్లలో ఇంచు భూమైనా వెనక్కి ఇచ్చారా.. అని ప్రశ్నించారు.
ఎట్లా భూములు గుంజుకోవాలె అనేదే రేవంత్ సర్కారు ఏకైక పని అని ఎద్దేవా చేశారు. 16 వేల ఎకరాలు కాదు.. మొత్తం 30 వేల ఎకరాలతో ఫ్యూచర్ సిటీ అని పొంకనాలు కొడుతున్నరని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ ఫ్యూచర్‌కే దిక్కులేదు.. రాహుల్ గాంధీకి కోపం వస్తే ఆయన పదవికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు కోపం వస్తే కాంగ్రెస్‌ను ఎప్పుడు బంగాళాఖాతంలో ఎత్తేస్తరో తెల్వదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు కనీసం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంచులిచ్చే ముఖం లేదని, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని ఆరోపించారు.
కేసీఆర్ 72 వేల కోట్లు రైతుల ఖాతాలో వేస్తే.. రేవంత్ రెడ్డి 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం అని, ఢిల్లీకి తెలంగాణ నుంచి వేలకోట్లు పోతున్నాయి.. కానీ పైసా తిరిగి రావడం లేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని కొత్త డైలాగులు కొడుతున్నారని, ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ముందు కనీసం లక్షాధికారులను చేయాలన్నారు.
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు.. కోటి 67 లక్షల మంది ఉన్నారని, వారందరికీ నెలకు రూ.2500 చొప్పున ఐదేళ్లకు ఇవ్వాల్సిన లక్షా 50 వేలు వేస్తే.. శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తా.. అని సవాల్ చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి.. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి ఆశ్యర్యపోయారని, నాకు స్వయంగా ఫోన్ చేసి, కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారని తెలిపారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని గుండెలనిండా అభినందించారని, పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అన్నారు.
బీఆర్‌ఎస్ గెలిచేది పక్కా..
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా.. బ్రహ్మాండంగా బీఆర్‌ఎస్ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నలుదిశలా కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె అనే నినాదం మార్మోగుతుందన్నారు. సీఎంగా రేవంత్ ఉన్నా.. ప్రజలు కేసీఆర్‌నే తలుచుకుంటున్నరని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారని, ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే.. పదేళ్ల పాలన సాగిందన్నారు.
ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని, బీఆర్‌ఎస్ ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టమన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది.. ఓ హిట్లర్‌రెడ్డి అని, తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. ఎవరైనా శ్రీరామచంద్రుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటారని, నరకాసరుడు, రావణాసురుడిని మించిన హిట్లర్.. రేవంత్‌రెడ్డికి ఆదర్శమని మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అని రేవంత్‌రెడ్డి అడిగారని, ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నరు.. నేను కుటుంబంలో ఇద్దరికి ఇస్త అని మాయమాటలు చెప్పారని, రైతుబంధు ఎకరానికి రూ.15 వేలు చేస్తా అని డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. 420 అబద్దాలతో ఆగంచేసి గద్దెనెక్కి రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదన్నారు. సమైక్యరాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దారిద్రాలన్నీ మరి దాపురించాయన్నారు.
షాపులో కాదు.. యూరియాను యాపులో పెడ్తం అన్నారని, ఇప్పుడు యాప్ లో యూరియా కాదు కదా.. చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్ గిరి పేరు లేదని తెలిపారు. రంగారెడ్డి, మల్కాజిగిరి రైతులకు యూరియా అవసరం లేదా.. ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నదో దీంతో అర్థమైపోతుందని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి.. రజినీకాంత్‌ను మించిన డైలాగులు కొట్టారని, భట్టి విక్రమార్క.. కమల్ హసన్ ను మించి యాక్టింగ్ చేశారని విమర్శించారు. వందరోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమన్నారని, రెండున్నరేళ్లయినా నాలుక గీసి పరేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడంలేదన్నారు.
వికాసం పోయి, విధ్వంసం వచ్చింది..
రాష్ట్రంలో వికాసం పోయి.. విషాదం, విధ్వంసం వచ్చిందన్నారు. హైడ్రా పేరిట దుర్మార్గం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కిట్ పోయి కరెంట్ కట్ వచ్చిందన్నారు. రైతుబంధు పోయి రాహుల్‌బంధు మొదలైందన్నారు. బీఆర్‌ఎస్ ప్రారంభించిన పథకాలను పాతర వేసి కుంభకోణాల జాతర మొదలైందని చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సర్‌తో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ కొత్తగా వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను ఏర్పాటు చేశారని, కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పుచేసిన రేవంత్ ..ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కితే ప్రతి బూత్ లో బీఆర్‌ఎస్ పార్టీకే మెజారిటీ వస్తుందన్నారు.
సర్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డును ఇస్తామన్నారు. ఈ గుర్తింపు కార్డుతో కార్యకర్తలు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి... ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.






