ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే
- ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్న సీఎం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : 25 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాలు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు ఎన్నో సేవలందించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభు త్వం ఈ చర్యకు దిగిందని ఆరోపించారు.
బీ ఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రభుత్వం భధ్రతను తగ్గించడంపై శనివారం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని, ప్రా ణాలకు ముప్పు ఉందని వెల్లడించినప్పుటికీ, కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.
సీఎం రేవంత్ మి త్రుడు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన ఫోక్సో కేసులో ప్రవీణ్ కుమార్ స్పందించడంతో ఈ కక్ష సాధింపు దిగారని ఆరోపించారు. ప్రభుత్వం కక్ష సా ధింపు రాజకీయాలను విరమించి వెంటనే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను పునరుద్ధరించాలని, ఆయనకు ఎలాంటి అపా యం జరిగినా సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు.
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు: హరీష్‌రావు
రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న, వారి చర్యలను ఎప్పటికప్పుడు ఎం డగడుతున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నా రు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడ టం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని హరీ ష్ రావు మండిపడ్డారు. భద్రతను తగ్గించినంత మాత్రాన ప్రవీణ్ కుమార్ ఆత్మస్థైర్యా న్ని, పోరాటస్ఫూర్తిని దెబ్బతీయలేరని, వెం టనే ఆయనకు తగిన భద్రతను పునరుద్ధరించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.






