28 June, 2026 | 2:51 AM

పీవీ సంస్కరణలతోనే బలమైన ఆర్థిక వ్యవస్థ

28-06-2026 01:44 AM
  1. పీవీని కాంగ్రెస్ అవమానిస్తే.. మోదీ గుర్తింపు ఇచ్చారు
  2. బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): నేటి బలమైన ఆర్థిక వ్యవస్థకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సంస్కరణలే కీలకమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సు భాష్ చెప్పారు. పీవీ దేశానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడన్నారు. శనివారం ఢిల్లీలో పీవీ 105వ జయంతి సందర్భంగా ‘ఏ స్టేట్స్‌మాన్స్ జర్నీ’ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సాధారణ కుటుంబం నుంచి దేశాన్ని న డిపించిన మహానేత పీవీ అని, సంఖ్యాబలం తక్కువైనా దేశ ప్రయోజనాల కోసం కీలక ని ర్ణయాలు తీసుకున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాంతం పనిచేసిన పీవీని... కాంగ్రె స్ అవమానపరిచితే, ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా తగిన గుర్తింపు ఇచ్చా రని తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వడం ద్వారా తగిన గౌరవం కల్పించారని, ప్రధానిగా పీవీ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసు కువెళ్తే.. ప్రధాని మోదీ అంతర్జాతీయంగా మన దేశానికి తగిన గుర్తింపు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. పీవీ సేవలను కాంగ్రెస్ గుర్తించలేదని ఆయన విమర్శించారు.