28 June, 2026 | 2:50 AM

ప్రస్తుత రేట్ల ప్రకారమే పరిహారం

28-06-2026 01:46 AM
  1. పాత భూ సేకరణ అవార్డును రద్దు చేయండి   
  2. అధికారులకు మంత్రులు ఉత్తమ్, సీతక్క  ఆదేశం
  3. ములుగు  జిల్లా  సాగునీటి ప్రాజెక్టులపై  సమీక్ష     

హైదరాబాద్, జూన్ 27, (విజయక్రాంతి) : ములుగు జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రా జెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి  చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారు లను ఆదేశించారు.  రైతులకు న్యాయం చే స్తూనే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్ష తన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం లో మంత్రి సీతక్క, నీటిపారుదల శాఖ ప్రధా న కార్యదర్శి  శ్రీధర్, ములుగు కలెక్టర్ బోర్ఖ డే హేమంత్ సహదేవరావు, ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్‌బాబు, ములుగు ఆర్డీఓ కృష్ణవేణి, ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామప్ప గ్రావి టీ కెనాల్ భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదికను మం త్రులకు సమర్పించారు.  ఈ ప్రాజెక్టుకు సు మారు 244.23 ఎకరాలు అవసరమవుతుందని, ఇందులో 201.03 ఎకరాలకు అవార్డు జారీ కాగా భూసేకరణ పూర్తికాలేదని వివరించారు.

2020- జారీ చేసిన అవా ర్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుం చి రూ.8.26 లక్షల వరకు  పరిహారం నిర్ణయించారని, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు గణనీయంగా పెరగడంతో  రైతులు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు.  దీని పై స్పందించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా భూసేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. 

పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజామార్కెట్  విలువల ఆధా రంగా కొత్త అంచనాలు రూపొందించి వెంట నే నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించారు. రామప్ప గ్రావిటీ కెనాల్ రెండేళ్లలో పూర్తి కావాలని, పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని, వచ్చేవారంలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్  ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిపై క్రమం తప్పకుండా సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఎన్సీని మం త్రులు ఆదేశించారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.