రేవంత్ ముంపు మేస్త్రీ
- తెలంగాణ జల హక్కులను తాకట్టు పెట్టిండు
- నదీ జలాలపై ఆయనకు అవగాహన లేదు
- ఏపీ, కర్ణాటకలను అడ్డుకోకుండా సంబరాలా?
- ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలి
- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : ‘రేవంత్‌రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రివి కావొద్దు. నదీ జలాలపై మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పం దం జరిగిందంటున్నవు.. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల న్యాయమైన వాటా సాధించారా లేదా స్పష్టం చేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డి మాండ్ చేశారు.
తెలంగాణ నీటిపారుదల శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని, రాష్ట్ర ఇంజనీర్లను బయటే కూర్చోబెట్టి తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్, కర్ణాటక సీఎం చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రేవంత్‌రెడ్డి బయటపెట్టాలని పేర్కొన్నారు. ఏపీతో అనుబంధం ఉండి, చంద్రబాబునాయుడు తనకున్న పలుకుబడితో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమించుకున్న కాంతారావు సమక్షంలో జరిగిన ఆ సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన అగ్రిమెంట్ ఏంటో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాల న్నారు.
రేవంత్‌రెడ్డికి నదీ జలాలపై అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ అని ఎద్దే వా చేశారు. దేవాదుల ఏ దేశంలో ఉందో తె లియదు, నల్లమల ఏ రాష్ట్రంలో ఉందో తెలియదు.. బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్‌కు మార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియక గతంలో అనేకసార్లు అభాసుపాలయ్యారని విమర్శించారు. ట్రిబ్యునళ్ల ముందు గట్టిగా వాదనలు వినిపించి, మంచి లాయర్లను పెడితే 700--800 టీఎంసీలు సాధించే అవకాశం ఉందన్నారు.
శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమా వేశంలో హరీష్‌రావు మాట్లాడారు. ఏపీ, కర్ణాటకలతో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి సంబరాలు చేసుకో వడం హాస్యాస్పదమని విమర్శించారు. కర్ణాటక 35 టీఎంసీల సామర్థ్యంతో ‘నవేలి రిజ ర్వాయర్’ నిర్మాణానికి పూనుకోగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 టీఎంసీల సామ ర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని, వీటి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంద న్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుచరుడు, శిష్యుడైన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం వల్లే మళ్లీ గుండ్రేవుల ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. తుంగభద్ర నదిపై 55 టీఎంసీల నీటిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆపేస్తే శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు.
సీఎంల సమావేశంలోని అంశాలను అసెంబ్లీలో చర్చించాలి
నదుల అనుసంధానం జరగాలంటే ముందు తెలంగాణ 968 టీఎంసీల ప్రాజెక్టుల అనుమతులన్నీ క్లియర్ కావా లని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు సాధించకుండానే నదుల అనుసంధానానికి ఎలా ముందుకు వెళ్తోందని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న 138 టీఎంసీలకు సంబంధించి సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టు 20 టీఎంసీలు, ఎల్లంపల్లి 30 టీఎంసీలు డీపీఆర్‌లను బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఢిల్లీలో సబ్మిట్ చేసిందని, కానీ రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం, క్లియరెన్స్ లేకపోవడం వల్ల సమ్మక్కసాగర్, వార్ధా డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో మిగిలిన 147 టీఎంసీల నదుల అనుసంధానం చే యాలని, ఆ అనుసంధానం తెలంగాణ భూభాగం సమ్మక్క సాగర్ నుండి నాగార్జునసాగర్ నుంచి వెళ్లాలని, అందులో సగం నీళ్లు 74 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాడే కేంద్రానికి డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ఏపీ తన 512 టీఎంసీల వాటాను పూర్తిగా వినియోగించుకుని, ఇప్పు డు నదుల అనుసంధానం పేరిట గోదావరి నుంచి మరో 200 టీఎంసీల నీటిని తరలించాలని చూస్తోందన్నారు.
పోలవరం- -బనకచర్ల లింకింగ్ తెలంగాణ నుంచి కాకుం డా ఆంధ్రా పోలవరం నుంచే పోయే విధంగా రేవంత్‌రెడ్డి అగ్రిమెంట్లు చేసుకున్నారని పత్రికల్లో లీకులు వస్తున్నాయని, దీనిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 968 టీఎంసీల నికర గోదావరి జలాలు, నదుల అనుసంధానం, కృష్ణా నికర జలా లు, ఆర్డీఎస్--తుంగభద్ర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, ముగ్గురు సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను శాసనసభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
హైడ్రా విషయం లో హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్ల విషయంలో రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన ’నీరో చక్రవర్తి’ స్ఫూర్తిగా తీసుకుని ఉండవచ్చు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక నిరసన ఉత్తరం కూడా రాయ డం లేదని విమర్శించారు.
రాష్ట్ర నీటి హక్కులను హరిస్తానంటే ఊరుకునేది లేదు
కేసీఆర్ తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి కనీసం 50 వేల ఎకరాలకైనా నీళ్లు వచ్చేలా చేశారని, ఇటీవల మీటింగ్‌లో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల గురించి కేంద్రమంత్రితో రేవంత్ డ్డి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నారా? అని హరీశ్‌రావు ప్ర శ్నించారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభు త్వం అక్రమంగా 9.5 టీఎంసీల సామర్థ్యం తో మూడు బ్యారేజీలు నిర్మిస్తుందని తెలిపారు.
వీటి వల్ల తెలంగాణకు నష్టం జరుగు తుందని రేవంత్‌రెడ్డి ఆ సమావేశంలో కనీ సం మాట్లాడలేదని, కేంద్ర మంత్రి సీ.ఆర్.పా టిల్ నుంచి ఎలాంటి హామీ తీసుకోలేదని మండిపడ్డారు. కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖలో ‘చిక్కమంచి, చిక్కలపర్వి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పవద్దు, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా సైలెంట్‌గా ఉండండి’ అని కోరినట్లు స్పష్టంగా ఉందన్నారు.
ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కర్ణాటక 45 టీఎంసీల నీటిని ఆపేస్తే.. భవిష్యత్‌లో ఆర్డీఎస్‌కు 5 టీఎంసీలు కూడా రావని, పాలమూ రు జిల్లా ఎడారిగా మారి ఆగమైపోతుందన్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర నీటి హక్కులను హరిస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.






