30 July, 2026 | 2:49 AM

చెట్టును ఢీకొని యువకుడు మృతి

30-07-2026 12:57 AM

రామాంతపూర్‌లో విషాద ఘటన  

ఉప్పల్ జులై 29 విజయక్రాంతి: రామాంతపూర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డుపై కూలిపోయి ఉన్న చెట్టును గమనించలేక ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఆల్విన్పేటకు చెందిన మనోజ్ కుమార్ (25) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి తన ద్విచక్ర వాహనం (నంబర్: AP36 AQ 2889)పై రామాంతపూర్ నుంచి ఇంటికి వెళ్తుండగా రామాం తపూర్ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో రోడ్డుపై పడివున్న చెట్టును గమనించక బ లంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్ కుమార్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఎల్బీ నగర్లోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై కూలిన చెట్టు తొలగింపులో జాప్యం, భద్రతా చర్యల లోపం వంటి అంశాలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడి అకాల మరణం స్థాని కులను కలచివేసింది.