నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దు
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఆత్మకూరు, జూలై 29:జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూరులో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ నివాసంలో నిర్వహించిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర స్తుతం ఎల్నినో ప్రభావం పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ వరి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఆల్మట్టి నుంచి కృ ష్ణా నదిలోకి నీటి ప్రవాహం కొనసాగుతోందని, జూరాలకు కూడా నీటి కొరత లేదన్నా రు. రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అనవసర సాకులు చెబుతోందని విమర్శించారు. తాను చెప్పిన అంశాల్లో ఏదైనా తప్పుంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాలువలకు నిరంతరాయంగా సాగునీరు విడుదల చేయాలని, ఒకవేళ నీటి సరఫరా నిలిపివేస్తే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
నీటి అంశాన్ని రాజకీయాలకు వేదికగా మార్చకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు నీటి అంశంపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని, ముందుగా రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో నాయకుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలోని రెండు మోటార్లను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






