30 July, 2026 | 3:45 AM

‘కాకతీయ’లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ

30-07-2026 12:56 AM

ఉప్పల్, జూలై 29, (విజయక్రాంతి): రామంతాపూర్లోని కాకతీయ హైస్కూల్లో విద్యా ర్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇ న్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఉప్పల్  పోలీసు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సమత, ఏఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఏఎస్‌ఐ జైపాల్ రెడ్డి, ఏఎస్‌ఐ రాజకుమారి పాల్గొని నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, బాధ్యతలను అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు.

సబ్ ఇన్స్పెక్టర్ స మత మాట్లాడుతూ, నాయకత్వం అనేది కే వలం హోదా కాదని, బాధ్యతతో కూడిన సే వ అని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతలను కూడా గుర్తిం చి ముందుకు సాగాలని సూచించారు. పోలీసు అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవం తం చేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.