నీట మునిగిన జర్నలిస్ట్ కాలనీ..
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..
స్పందించండి మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్
జర్నలిస్ట్ కాలనీకి రాకపోకలు బంద్..
బోధన్, జూలై 29 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి జర్నలిస్ట్ కాలనీ వర్షపు నీటిలో మునిగిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోకి రాకపోకలు నిలిచిపోగా, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, జర్నలిస్టులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, అధికారులు సమస్యను పరిశీలించినప్పటికీ, ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి పునరావృతమవుతుండటంతో, వెంటనే స్పందించి కాలనీలో నిల్వ నీటిని తొలగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జర్నలిస్టులు, కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.






