పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- మొత్తం 7,437 ఖాళీల భర్తీ
- త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తాం
- టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెల్లడి
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ పోలీసు శాఖలో భారీ గా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 7,437 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) మండలి వెల్లడించింది.

ఈ మేరకు నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, జైళ్లు, ఫైర్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే త్వరలో దరఖాస్తు తేదీలు ప్రకటిస్తామని పోలీసు నియామక బోర్డు తెలి పింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది.
మరిన్ని వివరాలకు ని యామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించాలని సూచించింది. ఎస్‌ఐ పోస్టులు 148, కానిస్టేబుల్ (సివిల్) 3697, కానిస్టేబుల్ (గ్రేహౌండ్స్) 1052, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ 1380, ఎస్పీఎఫ్ ఎస్‌ఐ 44, ఫైర్ ఫైటర్స్ 751 పోస్టులున్నాయి.
దరఖాస్తు చేయదల్చుకునే అభ్యర్థులు సరైనా ధ్రువపత్రాలను సమర్పించాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికెట్‌లతోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. లోకల్ అభ్యర్థులు 1-7వ తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్లు, లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.






