యువతి అదృశ్యం
11-08-2026 12:27 AM
ఘట్ కేసర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఓ యువతి అదృశ్యమైన సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్, ఫేజ్-2 లో నివాసముంటున్న ముక్కు వెంకటేశ్వర్లు కుమార్తె ముక్కు నవ్య(20) సోమవారం ఉదయం సుమారు 10:30 గంటలకు షాప్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళి, తిరిగి రాలేదని తెలిపారు.
ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన యువతి సుమారు 5 అడుగుల ఎత్తు, తెల్లని ఛాయ కలిగి ఉంటుందని, ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు టమాటా రంగు ట్రాక్ డ్రెస్ ధరించి ఉందని ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






