11 August, 2026 | 2:56 AM

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి

11-08-2026 01:39 AM

 ఉట్నూర్‌లో జైల్ భరో కార్యక్రమం

ఉట్నూర్, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఆపాలని దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ బరో కార్యక్రమాన్ని సోమవారం సిఐటియు, టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నిర్వహించారు. కార్మికులతో కలిసి నాయకులు, కార్మికులు ఐబి చౌరస్తా నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిఏజిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే. సునీత, సిఐటియు అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బోజ్జా ఆశన్నలు మాట్లాడుతూ...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిననాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, వీబీజీరాంజీ పథకం రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకం పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం ఆపాలని, కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కొడ్ లను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా, రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధంగా తీసుకొచ్చే నల్ల చట్టాలను, లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షులు ఉయిక విష్ణు, గ్రామ పంచాయతీ యూనియన్ ఉట్నూర్ మండల అధ్యక్షులు ఆత్రం సోనేరావ్, కోశాధికారి అర్కా వెంకట్రావు, ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు సంతోష్, అంగన్వాడి యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుభద్ర, జిల్లా, మండల నాయకులు, సుభద్ర, కుశవార్త, పార్వతి, లక్ష్మి, కృష్ణవేణి, ఆశ మండల నాయకులు రజిత, రాదా, సవిత, జీపీ యూనియన్ మండల నాయకులు చిత్రు, బాదీరావ్, రాంషో, యశ్వంత్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.