11 August, 2026 | 1:40 AM

13 నుంచి 19 వరకు రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు

11-08-2026 12:28 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ సర్కిల్, ఎదులాబాద్ లోని శ్రీగో దా సమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవం ఈనెల ఆగస్టు 13వ తేదీ (గురువారం) నుండి 19 (బుధవారం) వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ వంశపారంపర ధర్మకర్తలు పోరెత్తి లక్ష్మణాచార్యులు, పురుషోత్తమాచార్యులు తెలిపారు. 13న (గురువారం) ఉద యం ద్వజారోహణం, గరుడ ప్రసాదం, దేవతాహ్వానం, సాయంత్రం 6 గంటలకు దేవతా హ్వానం, 14 ఆగస్టు (శుక్రవారం) ఉదయం 9గంటలకు శేష వాహన సేవ, 11 గంటలకు ఆండాళ్ తిరునక్షత్రం, సాయంత్రం 6 గంటలకు హనుమంత వాహన సేవ, 15న (శని వారం) ఉదయం 9.00 గంటలకు అశ్వ వా హన సేవ సాయంత్రం 6 గంటలకు గజ వా హన సేవ,

16న (ఆదివారం) ఉదయం11 గంటలకు శ్రీగోదా సమేత రంగనాయకస్వా మి కల్యాణం, సాయంత్రం 6 గంటలకు గరు డ సేవ, 17న సాయంత్రం 6 గంటలకు దివ్య విమాన రథోత్సవం, 18న (మంగళవారం) ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, పుష్పయాగం,సాయంత్రం 6 గంటలకు చక్రతీర్థం, గంధోలి ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, 19న (బుధవారం) ఉదయం 10 గంటలకు స్వామి వారి తిరుమంజనం, ఘటాభిషేకం పూజా కార్యక్రమాలు ఉంటాయని కావున భక్తులు బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని ఆలయ ధర్మకర్తలు రామానుజాచార్యులు కృష్ణమాచార్యులు కోరారు.