అభివృద్ధికి సహకరిస్తాం... దోపిడీకి అడ్డుపడతాం..
- కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆరోపణ
- ఖానాపూర్ మున్సిపాలిటీలో ముసురుకుంటున్న వివాదం
ఖానాపూర్, సెప్టెంబరు 1,(విజయక్రాంతి ) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్, బిజెపి, బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య వివాదం ముదురుకుంటుంది .ఈ మేరకు శనివారం మున్సిపాలిటీ సాధారణ సమావేశం వాయిదా పడగా కమిషనర్ తనను కౌన్సిలర్లు వేధిస్తున్నారంటూ, తనను సరెండర్ చేయాలని కౌన్సిలర్లను కోరారం టూ వస్తన్న ఆరోపణల మధ్య, బిజెపి చైర్మన్ అంకం మౌనిక కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వి వాదం రాజుకుంటోంది .
ఈ నేపథ్యంలో సో మవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎంఎల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు .ఈ నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అభివృద్ధిపై ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బుజ్జి పటేల్, ఖానాపూర్ అభివృద్ధికి ఎల్లప్పుడు సహకరిస్తామని 11వ వార్డు కౌన్సిలర్, డిసిసి ఉపా ధ్యక్షులు రాజుర సత్యం అన్నారు.
అంతేకాకుండా ఖానాపూర్లో అభివృద్ధిలో భాగంగా చైర్మన్ వార్డులోనే కోటిన్నర రూపాయలతో బుడ్డోనికుంటా అభివృద్ధి ,పీహెచ్సీ భవనం ,సిసి రోడ్ల నిర్మాణం ,వివిధ అభివృద్ధి పను లు పట్టణంలో చేస్తుండగా అనవసరంగా ఆరోపించడం విడ్డూరమని అన్నారు.
తాము కమిషనర్ను వేధిస్తున్నామని అనడం సత్యదూరం అని, చైర్మన్ భర్త మహేందర్ అనవసరపు అధికారం చలాయిస్తూ మున్సిపాలిటీ అధికారులను, సిబ్బందిని వేధించ డంతో కమిషనర్ తో పాటు సిబ్బంది కూడా మనోవేదనకు గురవుతూ తమతో బాధను చెప్పుకున్నారని ,అంతేకాకుండా మున్సిపల్ భవన నిర్మాణం,
9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లను వేధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని ,చైర్మన్ భర్త అధికారం చలాయిస్తూ 33000 కారు అద్దె ,తన ప్రమాణ స్వీకారం నాడు ఆ పార్టీ రాష్ట్ర నాయకుని పిలిపించుకొని 75 వేల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం ఏమిటని ? ప్రశ్నించారు .ఇది అందరికీ తెలిసిన విషయమేనని అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే చిన్న మున్సిపాలిటీలో ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని అవన్నీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయబోతున్నామని అన్నారు.
బిజెపి పార్టీ ఎంపీ ఉన్న ఎంపీ నిధుల్లో నుంచి ఖానాపూర్ అభివృద్ధికి ఏమైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు .కాగా తాము మున్సిపల్ అభివృద్ధికి సుమారు 40 కోట్ల వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అనవసరంగా ఆరోపించే ముందు ఇవన్నీ చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మల రమేష్ ,జమాల్ , సతీష్,షబ్బీర్ ,నేత శ్యామ్, లాలు, అమనుల్లా ,జన్నారపు శంకర్, దేవతి రాజేశ్వర్ ,గోవిందు ,మదిరే సత్యనారాయణ ,కురుమ శ్రీనివాస్, సంతోష్ ,తదితరులు ఉన్నారు.






