2 September, 2026 | 4:16 AM

ప్రత్యామ్నాయ పంటలకు.. గిట్టుబాటు ఏదీ?

02-09-2026 | 01:43am
  1.     1.21 లక్షల ఎకరాల్లో గింజధాన్యాల సాగు 
  2. మార్క్‌ఫెడ్ మాటలే.. మార్గదర్శకాలు నిల్ 
  3. పంట ఉత్పత్తులు అమ్మేదెక్కడ? 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): వరి(Paddy), పత్తి(cotton)కి ప్రత్యామ్నాయంగా పప్పులు, నూనె గింజలు, కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహించింది. ఎల్ నినో ప్రభావం(El Nino impact)తో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో తక్కు వ నీటితో సాగయ్యే పంటలపై అవగాహన కల్పించింది. ఇందుకు రైతులు(Farmers) కూడా స్పం దించారు. గత ఏడాదితో కంటే ఈసారి అదనంగా 1,21,229 ఎకరాల్లో ప్రత్యామ్నా పంటలు సాగు చేశారు.

అయితే ప్రత్యామ్నాయ పంటల సాగు(Crop Cultivation) పెరిగినప్పటికీ.. వాటికి మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర(Remunerative price) కల్పించే విషయంలో ప్రభుత్వం నుంచి భరోసా దక్క డం లేదు.

ఫలితంగా ప్రత్యామ్నాయ పంటల మార్కెటింగ్‌పై రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం కేవలం వరి, పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు ఆ రెండు పంటలనే కొనుగోలు చేస్తోంది.

గతేడాది మక్కలను కూడా కొనుగోలు చేసింది. ప్రైవేట్ సంస్థలు(Private organizations), ప్రైవేట్ వ్యాపారులు(private traders) కూడా సంప్రదాయ పంటల కొనుగోలుకే అధికంగా మొగ్గు చూపుతున్నారు.

పప్పులు, నూనె ఉత్పత్తులు, ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సర్కార్‌తో పాటు ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

కార్యాచరణ ఏదీ?

మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యామ్నాయ పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా..ఇప్పటి వరకు కార్యాచరణ ప్రకటించలేదు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు.

పంటలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం, ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసినా మద్దతు ధర చెల్లించకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం ప్రత్యామ్యాయ పంటలకు  భరోసా కల్పించడంతో పాటు మద్దతు ధర విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరి గత ఏడాది  59,05,675 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 50,92,817 ఎకరాల్లో నాట్లు వేశారు. 9 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. పత్తి గత ఏడాది 45,21,192 ఎకరాల్లో వేయగా.. ఈ సంవత్సరం 48,21,503 ఎకరాల్లో సాగు చేశారు. వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా అదనంగా 3 లక్షలకు పైగా సాగు పెరిగింది. ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా గణనీయంగా పెరిగింది.