2 September, 2026 | 4:17 AM

కాంగ్రెస్ హయాంలోనే మైనారిటీలకు పెద్దపీట

01-09-2026 | 11:57pm

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలోనే మైనారిటీలకు పెద్దపీట వేసామని ప్రగతి పదం ప్రజా హితం మన తెలంగాణ ప్రభుత్వమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన(Indiramma Minority Women Scheme) చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం కలెక్టర్ మీటింగ్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరడం ముదాభావమన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మైనారిటీల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రశంసించ దగ్గదని తెలిపారు. జవహర్ నగర్ లోని మైనారిటీలకు సంబంధించిన చెక్కులను జవహర్ నగర్ లోని లబ్ధిదారులైన జులేఖా బేగం,        తదితరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, నాయకులు బల్లి శ్రీనివాసు గుప్తా, నంగునూరు అశోక్ గుప్తా, గజ్వేల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, బొబ్బిలి మంజుల, విజయరాయ్ మైనారిటీ అధ్యక్షులు రఫీక్, గండి సునీత, పరుశురాం ,రాజు యాదవ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.