ఆచరణాత్మక విద్యతోనే సృజనాత్మకత
కుబీర్ సెప్టెంబర్ 1 ( విజయక్రాంతి) పు స్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక విద్య ను అందించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (District Collector Bhavesh Mishra) అన్నారు. మంగళవారం తానూరు మండల కేంద్రంలోని క స్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Sturba Gandhi Girls' School) ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థు లు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, మిగిలిన పాఠ్యాంశాల వివరాలను అడి గి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా సిలబస్ పూర్తి చేసి, పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు.
పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే గుర్తించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం బోర్డు మీద గణిత లెక్కలు రాయించి సమాధానాలు చెప్పిన విద్యార్థినుల పెన్నులను బహుమతిగా అందించారు. మొగిలి గ్రామంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి గ్రామస్థులు అందించిన వినతిని కలెక్టర్ స్వీకరించారు. అనంతరం విఠలేశ్వర ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ మహేందర్నాథ్, ఎంపీడీవో శ్రీధర్, ఏఎంసీ ఛైర్మన్ షిండే ఆనంద్రావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, సర్పంచ్ ఉష, ఉపసర్పంచ్ నితిన్, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






