2 September, 2026 | 4:15 AM

టీచర్లతో పెట్టుకోవద్దు

02-09-2026 | 01:50am

కాంగ్రెస్‌కు మిగిలింది ఇక 825 రోజులే!

  1. ఒకటో తేదీన జీతాలు తప్ప మాకేం ఇచ్చారు? 
  2.    2034 వరకు అధికారంలో ఉండాలంటే మా సమస్యలు పరిష్కరించాల్సిందే..
  3. దాచుకున్న సొమ్ము ఇమ్మంటే మాకేదో కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం 
  4. సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైంది? 
  5. సీఎం ఆదేశాలు కింది స్థాయిలో అమలు కావడంలేదు 
  6. ఆర్థికశాఖలో ఏం జరుగుతుందో సీఎం తెలుసుకోవాలి 
  7. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విడుదలకు కమీషన్లు అడిగే మంత్రులపై చర్యలేవి? 
  8.    10 తర్వాత ఉద్యమ కార్యాచరణ 
  9. టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి 
  10. ధర్నా చౌక్‌లో పీఆర్టీయూటీఎస్ మహాధర్నా

 CLICK HERE : కదంతొక్కిన ఉద్యోగులు!

హైదరాబాద్/ముషీరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కంపెన్సేటరీ పెన్షన్ స్కీం(Compensatory Pension Scheme) (సీపీఎస్) రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని.. 2003 డీఎస్సీ అభ్యర్థుల(DSC Candidates)కు పాత పెన్షన్ అమలు(Implementation of Old Pension) చేయాలని డిమాండ్‌చేస్తూ మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌(Hyderabad Indira Park Dharna Chowk)లో వేలాది మంది ఉపాధ్యాయుల(Teachers)తో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్‌డ్ టీచర్స్ యూనియన్-టీఎస్{Progressive Recognized Teachers Union-TS} (పీఆర్టీ యూటీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది.

ఈ మహాధర్నాకు ముఖ్యఅతిథిగా టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి(Pingali Sripal Reddy) హాజరై ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల 10న ఉద్యోగుల జేఏసీ(Employees JAC) తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి(Chalo Hyderabad program) తమ మద్దతు ఉంటుందని, ఈలోపు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 10 తర్వాత పీఆర్టీయూ టీఎస్ ప్రత్యేక ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వెయ్యి రోజులు అయిపోయాయని, ఇక మిగిలింది 825 రోజులు మాత్రమేనని శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు.

‘సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటారు.. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ యే అధికారంలో ఉంటుందని, తానే సీఎం అని.. అప్పటివరకు అధికారంలో ఉండాలంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చి న హామీల్లో సీపీఎస్ రద్దు, పీఆర్సీ ప్రకటన, డీఏలు విడుదల, పెండింగ్ బకాయిలతోపాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరించా ల్సిందే’ అని తేల్చిచెప్పారు. ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు తప్ప మాకేం ఇచ్చారు? అని ప్రశ్నించారు. తాము దాచుకున్న సొమ్ము ఇమ్మంటే మాకేదో కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ ఏమైందని,పీఆర్సీ ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలు కిందిస్థాయిలో అమలుకావడంలేదన్నారు. ఆర్థికశాఖలో ఏం జరుగుతుందో సీఎం తెలుసుకోవాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విడుదలకు కమీషన్లు అడిగే మంత్రు లపై చర్యలెందుకు తీసుకోవడంలేదని, ప్రభుత్వంలో మంత్రులు, ఉద్యోగులు సమానమేనని, ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హితవు పలికారు. 

మ్యానిఫెస్టో అంటే..

తమ సమస్యలు పరిష్కరించకుంటే కాం గ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమ ని హెచ్చరించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏం పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వ స్తే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయ డంలేదని ప్రశ్నించారు. మ్యానిఫెస్టో అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒప్పందం లా ంటిదని, దాన్ని విస్మరిస్తున్నారని, ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని మండిపడ్డారు.

రెండు దఫాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి.. అదే నిజం కావాలంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు చేస్తేనే రెండు దఫాలు మీ ప్రభుత్వమే ఉంటుందన్నారు. గత ప్రభు త్వం ఐదు శాతం ఐఆర్ ఇచ్చి పీఆర్సీ కమిటీ వేయగానే.. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో లో అనేక అంశాలను చేర్చిందని, కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే పీఆర్సీ పాత కమిటీ రద్దు చేసి దాని స్థానంలో కొత్త కమి టీ వేసి 6 నెలల్లోపే నివేదిక తెప్పించుకుంటారని తాము భావించామన్నారు.

కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ వెళ్తున్నారంటూ అన్నారు. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది ఉద్యోగ సంఘాలకు తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ ఉం టే ఎందుకు రిపోర్టు ప్రభుత్వానికి చేరడం లేదని ప్రశ్నించారు. జూన్ 2న పీఆర్సీ ప్రకటిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా ఆశిం చామన్నారు.

ఉద్యోగ సంఘాలు కార్యాచర ణ తీసుకోగానే సీఎం పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం.. ఆ తర్వాత వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడం జరిగిందని.. ఇలా ఇప్పటివరకు ఐదు సార్లు జరిగిందంటూ ఆయన మండిపడ్డారు. తమ జీతాల నుంచి హెల్త్ స్కీం కోసం నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్ అయ్యాయని, కానీ ఇంత వరకూ అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో  ముఖ్యమంత్రి ఆదేశాలు 

అమలు కావడంలేదు..

సీఎం ఆదేశాలిస్తే కింది స్థాయిలో అధికారులు అమలు చేయడంలేదని, సీఎం చెప్పేది ఒకటి అధికారులు చేసిది మరోకటన్నారు. కమిటీలతో కాలయాపనలు వద్దని, తమకు తక్షణమే అమలు కావాలన్నారు. అసలు ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల విడుదలకు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క భార్య డిమాండ్ చేశారని, ఓ మహిళా రిటైర్డ్ ఉద్యోగి ఆరోపణలు చేస్తే వాటిపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులపై మీడియాలో ఆరోపణలు వచ్చినప్పుడు వారిని సస్పెండ్ చేసినట్లే మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని, దీనిపై ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు, మంత్రులు సమానమేనని ఆయన పేర్కొన్నారు. ఏమన్నా అంటే ఆర్థిక భారమని దాటవేస్తున్నారని, ఆర్థిక భారంతో సంబంధంలేని 317, 190 జీవోలను ఎందుకు అమలు చేయడంలేదన్నారు.

ఇప్పటి వరకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, సమస్యలు తగ్గాలి కానీ పెరుగుతున్నాయన్నారు. అనాలోచిత నిర్ణయాలతో పాలిటెక్నిక్ విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం అనాలోచి నిర్ణయాలతో ఇబ్బడి ముబ్బడిగా అద్దె భవనాల్లో గురుకులాలను ఏర్పాటుచేశారని, వాటి అద్దెకే రూ.వందలాది కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

హడావుడిగా ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రారంభించారని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఉన్నారని, వెంటనే తమ సమస్యలన్నీ పరిష్కరించాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటించే దిశగా ఆలోచన చేస్తామని ప్రభుత్వానికి ఆయన హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు నాయకులు వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

51శాతంతో ఫిట్‌మెంట్ ప్రకటించాలి: సుంకరి భిక్షంగౌడ్ 

51 శాతంతో ఫిట్‌మెంట్ ప్రకటించాలని సుంకరి భిక్షం గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పీఆర్సీ రిపోర్ట్‌ను వెంటనే తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలివ్వకుంటే  పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.

కోట్లు ఇవ్వడంలేదు.. 

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లిస్తామని మే 2న సీఎం మరో హామీ ఇచ్చారని, కానీ 121 రోజులవుతున్నా విడుదల చేయలేదని శ్రీపాల్ రెడ్డి విమర్శించారు. కేవలం జీపీఎఫ్, కమ్యుటేషన్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. రిటైరైన ఉద్యోగికి కోటి రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సభలో చేసిన వ్యాఖ్యలపై  ఆయన సీరియస్ అయ్యారు.

ప్రభుత్వం తమకిచ్చేది రూ.13 నుంచి రూ.16 లోల వరకు గ్రాట్యుటి తప్పా మిగతా డబ్బంతా ఉద్యోగి దాచుకున్న సొమ్మేనని...ప్రభుత్వానికి కావంటూ స్పష్టం చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఉద్యోగులకు ఇవ్వకుండా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులపై వ్యతిరేక భావం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ప్రభుత్వం విఫలం: పుల్గం దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు 

హామీలు అమలుచేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని పుల్గం దామోదర్ రెడ్డి తెలిపారు. ఈహెచ్‌ఎస్, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్, సీపీఎస్ అమలు వంటి హామీలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. గడువు ముగిసిమూడేళ్లయినా పీఆర్సీని ఇంత వరకూ ప్రకటించలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. నాలుగు నెలలకు గానూ ఈహెచ్‌ఎస్ కోసం ప్రభుత్వం రెండు ఇన్‌స్టాల్‌మెంట్లనే చెల్లించిందన్నారు. మే 2న సీఎం ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతోనే మహాధర్నాను చేపట్టాల్సి వచ్చిందన్నారు.