29 June, 2026 | 3:11 AM

‘సర్’ సమర్థవంతంగా నిర్వహించాలి

29-06-2026 01:59 AM

మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్

మేడ్చల్ అర్బన్ జూన్ 28 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ డివిజన్ ప్రాంతంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ బిఎల్‌ఓ,బిఎల్‌ఏ లతో కలిసి పరిశీలించినట్లు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేశారు.ఈ సందర్భంగా డిసి మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియను బిఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఓటరు జాబితాలో కచ్చితంగా ఉండేలా అవసరమైన వివరాలను జాగ్రత్తగా సేకరించాలని డిసి ఆదేశించారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గౌడ మహేష్ కురుమ మాట్లాడుతూ ప్రజలు బిఎల్‌ఓ లు అందజేసే ఎన్యుమరేషన్ ఫారం ను పూర్తి వివరాలతో సక్రమంగా నింపి సమర్పించాలని తెలిపారు.అంతే కాకుండా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.