నిండు జీవితానికి రెండు చుక్కలు
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్, వార్డు ఆఫీస్ లో, కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో, మారుతి నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో, భోలక్ పూర్ డివిజన్ రంగనగర్ లో ముషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహలతో కలిసి వేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ప్రెసిడెంట్లు, వల్లాల శ్యామ్ యాదవ్, వై. శ్రీనివాస్ రావు, కొండా శ్రీధర్ రెడ్డి, ముఠా నరేష్ కార్యదర్శులు, పోతుల శ్రీకాంత్, సాయి కృష్ణ, డాక్టర్లు రాజ్యలక్ష్మి, డాక్టర్ అవంతి, డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డీ, బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి ః బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సర్కిల్ ఆఫీస్ కేంద్రం లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి, ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కోట్ల వెంకట్ నరేష్, ఎ. ఎన్. ఎమ్. సుజాత,వైద్య సిబ్బంది మరియు ఇతర ఆరోగ్య శాఖ, మునిసిపల్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలి ః పోలియో రహిత తెలంగాణ మన లక్ష్యం
విద్యావతి పాండు యాదవ్
సికింద్రాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): చిన్నారులకు పోలియో చుక్కలు తప్పక వేయించాలి అన్ని విద్యావతి పాండు యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ఆరోవ వార్డ్ లో సిఎంఆర్ స్కూల్, వాణి కాన్వెంట్, సెయింట్ పీటర్స్ స్కూల్, తాడ్బండ్, తవాయిపుర, మత్మా నగర్, నందమూరినగర్, కుమ్మరిగుట్ట లో పల్స్ పోలియో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పాల్గొని 0-5 చిన్నారులకు విద్యావతి పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా విద్యావతి పాండు యాదవ్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే మన ముందున్న లక్ష్యం అన్ని తెలియజేస్తూ భారతదేశంలో చివరి పోలియో కేసు 13 జనవరి 2011 న గుర్తించబడిందని, అనంతరం 2012లో భారత్ పోలియో వ్యాధి ప్రబల దేశాల జాబితా నుండి తొలగించపడ గా, 2014 మార్చి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో నుండి పోలియో రహిత దేశంగా ధ్రువీకరణ పత్రం పొందిందని విద్యావతి పాండు యాదవ్ తెలిపారు.
పోలియో లేదనే భావన మనలో ఉండకూడదని ,వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు తల్లిదండ్రులు తప్పక పోలియో చుక్కలు వేయించాలని వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని విద్యావతి పాండు యాదవ్ విజ్ఞప్తి చేశారు.
ఐదేండ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలను వేయించండి ః మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్
జవహర్ నగర్, జూన్ 28 (విజయక్రాంతి): ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలను వేయించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ లు అన్నారు. ఆదివారం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ లోని 8వ డివిజన్ లోని అంగన్వాడి కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలను వేయించాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శారద మనోధర్ రెడ్డి ,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, భారతి, శంకర్, చిన్న పిల్లల తల్లిదండ్రులు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది స్థానిక ప్రజలు మహిళలు పాల్గొన్నారు






