29 June, 2026 | 1:55 AM

సిరీస్ సమర్పయామీ

29-06-2026 01:06 AM

రెండో టీ20లోనూ భారత్ ఓటమి 

సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఐరిష్ టీం

టీ20 ఫార్మాట్‌లో వరల్ ఛాంపియన్స్ భారత్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తొలి టీ20 తరహాలోనే మరోసారి సమిష్టిగా రాణించిన ఐర్లాండ్ సంచలన విజయాన్ని న మోదు చేసింది. రెండో మ్యాచ్ లో భారత్ పై 1 పరుగు తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐర్లాండ్ జట్టు టీమిండియాపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. 

బెల్‌ఫాస్ట్, జూన్ 28: రెండో టీ0 కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ను తప్పించారు. వారిద్దరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ అరంగేట్రం చేశారు.  మొద టి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత పుంజుకుని సిరీస్ సమం చేస్తుందనుకున్న భారత్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శనే కనబరిచింది.

ఐర్లాండ్ బ్యాటర్లను టీమిండియా పేసర్లు ముప్పుతిప్పులు పెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో ఐర్లాండ్ బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు చేయలేకపోయింది, ము ఖ్యంగా అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్‌ను దెబ్బకొట్టాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టెక్టర్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.

భారత్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐర్లాండ్ 154 రన్స్‌కే పరిమితమైంది. తర్వాత ఛేజింగ్‌లో ఐర్లాండ్ బౌలర్లు భారత్‌కు షాకిచ్చారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లను డకౌట్ చేశారు. కాసేపటికే శ్రేయాస్ అయ్యర్(10), ఇషాన్ కిషన్ (12) కూడా ఔటవడంతో టీమిండియా పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటే ల్, తిలక్ వర్మ ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు.

అక్షర్ పటేల్ (14) ఔటైన తర్వాత తిలక్, దూబే ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరి పార్టనర్ షిప్ మ్యాచ్ గెలవడంపై ఆశలు రేకెత్తాయి. కానీ చివర్లో ఐర్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. తిల క్ వర్మ 55 పరుగులకు వెనుదిరిగాడు. అరంగేట్రం చేసిన సూర్యాన్షు షెడ్జే ఐదు బంతు ల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటవ్వడంతో భారత్ ఓటమి ఖరారయింది.

ఆఖర్లో హర్షిత్ రాణా భారత్‌ను గెలిపించినంత పనిచేశాడు. 10 బంతుల్లో రెండు ఫో ర్లు, ఒక సిక్సర్తో 21 పరుగులు చేసి ఆఖరి రెండు బంతుల్లో 8 పరుగులు కావా ల్సి ఉండగా అవుటయ్యాడు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదగా ఐర్లాండ్ ఒక్క పరు గు తేడాతో విజయం సాధించింది. భారత్‌పై సిరీస్ గెలవడం ఐర్లాండ్‌కు ఇదే తొలిసారి.

స్కోరు బోర్డు 

ఐర్లాండ్ ఇన్నింగ్స్ : 154/8 ( టెక్టర్ 53, బెంజిమెన్ 37, డాక్‌రెల్ 19 ; ప్రిన్స్ యా దవ్ 3/22, అర్షదీప్ 2/35, దూబే 2/25 )

భారత్ ఇన్నింగ్స్ : 153/9 ( తిలక్ వర్మ 55, దూబే 20, హర్షిత్ రాణా 21 ; మూండ్రా 3/32, హాల్లార్డ్ 3/26)