28 June, 2026 | 7:39 PM

కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు

28-06-2026 06:38 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. నల్గొండ కార్పొరేషన్ లో రూ.83 కోట్లతో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు, జిల్లాలోని పలు అభివృద్ధ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నల్గొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన అందరికీ నల్గొండ చరిత్ర తెలుసు అని, తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసింది... కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.

మలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన వారని, నల్గొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునేలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష కూడా చేశారని తెలిపారు. వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే ఆ త్యాగాన్ని టీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో వేసుకున్నారని, పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె తెచ్చుకొని వాళ్లు త్యాగాలు చేసినట్లు చెప్పుకున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహించారు. ఏ పదవులు ఆశించకుండా ప్రాణాలు అర్పించిన వారిని త్యాగాలు కావా? అని, కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని, పదేళ్లు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.