వృద్ధాప్యంలోనూ క్రీడా ఉత్సాహం అభినందనీయం
కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్
కోదాడ, జాన్ 28 : పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నాయక్ కొనియాడారు. ఆదివారం కోదాడలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక కళా పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి దండ శ్యాంసుందర్ రెడ్డి, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, ఉపాధ్యక్షులు యస్దాని, భ్రమరాంబ,బాలేమియా, హాజీ నాయక్, జగిని శoభయ్య పాల్గొన్నారు.






