20 March, 2026 | 8:19 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోండి

20-03-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

చండూరు, మార్చి 19: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చం డూరు ప్రాంతం ఎంతో కాలం నుండికులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణం లో ఉందని తెలిపారు.

ఈ పరిస్థితిని భంగపరుస్తూ బీజేపీ జిల్లా నాయకులు వచ్చి ప్రజ లను రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదన్నారు. కస్తాల ఎక్స్ రోడ్ వద్ద జరిగిన గొడవలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ గొడవల్లో ఎక్కువ మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలే ఉన్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురు మాత్రమే ఉన్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు. గొడవలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గాయపడినప్పటికీ పోలీసులు స్పందించలేదని విమర్శించారు. ముఖ్యంగా దళితుడిపై దాడి జరిగినా కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు కారణం ఒక ఇసుక వ్యాపారి కిరణ్ అని, చిన్న వివాదాన్ని పెద్ద గొడవగా మార్చి రాజకీయ రంగు పూశారని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సంబంధం లేని వారిని రిమాండ్కు పంపారని విమర్శించారు.బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయకపోతే వచ్చే రెండు మూడు రోజుల్లో చండూరు పట్టణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఇదే సమయంలో తమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాదికాలంగా పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని, వాటి ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, కౌన్సిలర్లు కటకం రమేష్, కోడి వెంకన్న, వాసు, ధర్మేందర్, మారయ్య, శేఖ ర్, మల్లేశం, బ్రహ్మం, వెంకన్న, కృష్ణారెడ్డి, లతీఫ్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.