9 July, 2026 | 1:17 AM

ధాన్యం సేకరణలో విఫలం

09-07-2026 12:16 AM
  1. గోదాములు, రైస్ మిల్లుల వ్యవస్థ సరిగా లేదు  
  2. మిల్లింగ్ బియ్యం ఎఫ్‌సీఐకి చేరడం లేదు 
  3. బీజేపీ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక
  4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు
  5. రైతు సమస్యలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి వినతి  

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం తెలిపినా చేతులెత్తేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. గన్నీ బ్యాగులు సమకూర్చడం, గోదాములు, రైస్ మిల్లుల వ్యవస్థ కూడా సరిగా లేదన్నారు. మిల్లింగ్ చేసిన బి య్యం ఎఫ్‌సీఐకి చేరడంలేదన్నారు.

రైతు సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేయాలని కేటీఆర్ పిలు పునిస్తున్నారని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి ధర్నాకు వస్తే నిజాలేంటో తెలియజేస్తామని స్పష్టం చేశారు. బుధవారం ఎంపీ రఘునందర్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇతర నేతలతో కలిసి కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని ఢిల్లీలో కలిశారు. తెలంగాణలో ధా న్యం కొనుగోలు విషయంలో రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరిగా ధాన్యం కొను గోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలకు దిగారని,  రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశార ని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యమం చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. 

‘సీఎంఆర్’ జాప్యం

 ధాన్యాన్ని సేకరించడమే కాకుండా మిల్లింగ్ చేసి(సీఎంఆర్), బియ్యాన్ని ఎఫ్‌సీఐలకు చేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఖర్చులకు రాష్ట్రానికి కేంద్రమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. 2024-25 వానాకాలం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, ఎఫీసీఐలో జమ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 13 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు.

2024--25 యాసంగిలోనూ ఇదే పరిస్థితి ఉందని, 2025--26 వానాకాలానికి సంబంధించి 45 శాతం, 2025--26 యాసంగిలో 90 శాతం బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు.   

రెండు పార్టీలవి గాలి మాటలు

ధాన్యం కొనుగోళ్లకు గడిచిన 12 ఏళ్లలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ద్వారా రాష్ట్రప్రభుత్వానికి రూ.1.16 లక్షల కోట్లు రుణాలను కేంద్రం అం దజేసిందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 2025--26లో ధాన్యం సేకరణ కోసం రాష్ట్రప్రభుత్వానికి రూ.37 వేల కోట్లను ఎన్సీడీసీ ద్వారా అందజేసిందన్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,700 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధుల విషయంలో కేంద్రప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం ప్ర తి కేజీలో 70 శాతం నిధులు కేంద్రప్రభుత్వం ఇస్తుంన్నారు. గాలిమాటలు మాట్లాడటం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అలవాటుగా మారిందని మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.