మాదాపూర్‌లో హ్యాష్ ఆయిల్ కలకలం
- 920 గ్రాములు స్వాధీనం
- నిందితుడు దినేష్ అరెస్ట్
- పరారీలో మరో ఆరుగురు నిందితులు
శేరిలింగంపల్లి,మార్చి 19 (విజయక్రాంతి): మాదాపూర్‌లో హ్యాష్ ఆయిల్ విక్రయానికి సిద్ధమవుతున్న నిందితుడిని ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకుని 920 గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీ, సిటీ వైన్స్ సమీపంలో నిర్వహించిన దాడిలో పరుసముల దినేష్ (28) అనే కారు మెకానిక్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 180 చిన్న బాటిళ్లలో నిల్వ ఉంచిన హ్యాష్ ఆయిల్ను స్వాధీ నం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడి నిర్వహించారు. ముసాపేట్‌కు చెందిన ప్రవీణ్ వద్ద నుండి డ్రై గంజాయి కొనుగోలు చేసి ఆయిల్గా మార్చి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యో గులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
ఈ కేసులో ప్రవీణ్, యూసుఫ్, శరత్, విన్ని, చందు, రేవంత్లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశా రు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




