20 March, 2026 | 11:20 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నాగోల్లో వైభవంగా ఉగాది వేడుకలు

20-03-2026 12:00 AM

నాగోల్, మార్చి 19 (విజయక్రాంతి): తెలుగు ప్రజల నూతన సంవత్సర పండుగ ’ఉగాది’ వేడుకలు నాగోల్ డివిజన్ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఉప్పల శ్రీనివాస్ గుప్త తన నివాసంలో భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలను ప్రారంభించారు.పండుగ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వ హించి, హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని కొనియాడారు.

ఈ నూతన సంవ త్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం కొత్త వెలుగులు నింపాలని, అందరికీ ఐశ్వర్యం, విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాని చెప్పారు.