30 August, 2026 | 8:11 PM

Breaking News

జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •  

జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

08-07-2026 09:35 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): స్థానిక ములకలపల్లి  మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి హెచ్ఎం లక్ష్మణ్ కి బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న విద్యాసంస్థల బంద్ కు సంబంధించి సర్క్యులర్ ను అందజేశారు. ఈసందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్,ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు తెల్లం అఖిల్  మాట్లాడుతూ  27వేల ప్రభుత్వ పాఠశాలలు 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను వెంటనే మానుకోవాలనీ, ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలనీ,

అన్ని ఖాళీ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి కఠిన నియంత్రణలు అమలు చేయాలనీ,పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలనీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనీ, పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్ల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలనీ, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మధ్యాహ్నం భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ వంటివి అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగచైతన్య, నూప రవీందర్,చందు,గీతా, మాధురి, అనిత, దివ్య,వాణి, ఏఐఎస్ఎఫ్ నాయకులు ధోని,మానస, కళ్యాణి,తదితరులు పాల్గొన్నారు.