9 July, 2026 | 1:47 AM

కాంగ్రెస్‌లో చేరితే పదవిపై ఆలోచిస్తాం

09-07-2026 12:55 AM
  1. మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోతే బాధ్యత ఎవరిది?
  2. హరీష్‌రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీ ష్‌రావుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి మంత్రి పదవి అడుగుతున్న హరీష్‌రావుకు బీఆర్‌ఎస్‌లో ఇబ్బంది ఉంటే.. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరితే మంత్రి పదవి అంశం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఆలోచిస్తారని జగ్గారెడ్డి తెలిపారు.

మీరు కట్టిన ప్రాజెక్టు, మీ హయాంలో కూలిపోతే దానికి బాధ్యులు ఎవరని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి కేసీఆర్‌ను హరీష్ రావు అసెంబ్లీకి తీసుకురావాలన్నారు. కేసీఆర్, హరీష్‌రావులు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ జరిగిందన్నారు.  కాళే శ్వరం నీళ్లు నింపాలంటున్న హరీష్ ఖమ్మం జిల్లా మునిగిపోవాలా? బాధ్యత తీసుకుంటా వా? సీఎంకు లేఖ రాయాలని డిమాండ్ చేశా రు.

చీటికి మాటికి గురుదక్షిణ చంద్రబాబుకు ఇచ్చారంటున్న హరీష్‌రావు కేసీఆర్ టీడీపీలో నుంచి వచ్చింది, కేటీఆర్‌కు ఎవరి పేరు పెట్టా రో మర్చిపోవద్దన్నారు.  నీళ్ళు ఇవ్వలేదని రే వంత్‌ను ఉరి వేయాలంటున్న హరీష్‌రావు మరి డ్యామ్ కూలిపోవడానికి కారణమైన మిమ్మల్ని ఏం చేయాలని ధ్వజమెత్తారు.