కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన
నిర్మల్ సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) టీజీ జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం సిపిఎస్ ను (CPS) రద్దు చేయడం నేర్పిస్తూ పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయంలో (Government office) పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నల్ల బ్యాడ్జిలు పెట్టి కలెక్టర్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేయడం వల్ల వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధిలో ఉద్యోగులు భాగస్వామ్యం అయినప్పటికీ వారి సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పిజిజేఏసీ ఆధ్వర్యంలో నిరంతరంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు వెలుమల ప్రభాకర్ రవికుమార్, పెన్షన్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న, జేఏసీ నాయకులు పీజీ రెడ్డి రమేష్ మురళీమోహన్ రెడ్డి పెంట్ అశోక, కృష్ణారావు ఉద్యోగులు పాల్గొన్నారు.






