05-02-2026 01:43:45 AM
పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవ న్.. ఓ దిష్టి కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వ్యతిరేకి అయిన పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేసు కోవాలన్నారు. గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని, పవన్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ఓటు వేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పారు. బుధవారం మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ము న్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండుసున్నా రా బోతోందని జోస్యం చెప్పారు.