calender_icon.png 5 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం భరోసా

05-02-2026 01:42:25 AM

ఎమ్మెల్యే వీ నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 4(విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ హాబిబ్ ఫాతిమా నగర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే వి. నవీన్ యాదవ్ హాజరయ్యారు. మొత్తం 138 మంది లబ్ధిదారులకు కోటి 38 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.

ఇందులో 48 కళ్యాణ లక్ష్మి, 85 షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందన్నారు. ఇది నిరుపేద తల్లిదండ్రులకు ఒక గొప్ప వరమని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హులైన కుటుంబానికి ఈ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్ రెడ్డి, భవాని శంకర్, ఎంఆర్‌ఓ ప్రేమ్ కుమార్, ఇతర రెవె న్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.