calender_icon.png 5 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే పాషాఖాద్రి కన్నుమూత

05-02-2026 01:45:21 AM

ఎంఐఎం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలు

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి(72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కంచన్ బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. పాషా ఖాద్రి 1986లో డబిర్‌పురా నుంచి కార్పొరేటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, 2004 నుంచి వరుసగా మూడుసార్లు చార్మినార్ ఎమ్మెల్యేగా, 2018లో యాకుత్‌పురా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఓవైసీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. పాషా ఖాద్రి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, అసదు ద్దీన్ ఓవైసీ తీవ్ర సంతాపం ప్రకటించారు. బుధవారం నూర్ ఖాన్ బజార్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు