నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్ : దయాకర్ రెడ్డి
- మంత్రి పొంగులేటి సిఫారసుతో 75 మందికి చెక్కుల పంపిణీ
- రూ.27 లక్షల ఆర్థిక సాయం అందజేత
ఖమ్మం, జులై 7(విజయక్రాంతి): తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిఫారసుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 మంది లబ్ధిదారులకు సుమారు రూ.27 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి లబ్ధిదారులకు ఈ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, మంత్రి పొంగులేటి చొరవతో ఉమ్మడి జిల్లాలోని ఎందరో నిరుపేదలకు వైద్య, ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.






