ఆగని భూదందా
- ఫేక్ అకౌంట్‌లతో ధరణి, భూభారతిలో భారీగా అక్రమాలు
- సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే
- సింగరేణి విషయంలో కాంగ్రెస్ క్రెడిట్ పాలిటిక్స్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో భూపరిపాలన అస్తవ్యస్తంగా మారింది. అప్పుడు ధర ణి, ఇప్పుడు భూభారతి పోర్టల్‌లో ఫేక్ అకౌంట్‌లు వెలుగులోకి వచ్చాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాం లో ధరణి పోర్టల్‌లో భారీగా ఫేక్ అకౌంట్‌లు సృష్టించారని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే సుమారు 2 వేల ఫేక్ అకౌంట్లు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంద న్నారు.
ధరణిపై విచారణ జరుపుతు న్న ’సిట్’ పరిధిని విస్తరించి, భూభార తి అవకతవకలపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడారు. ధరణి, భూభారతి పోర్ట ళ్లలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి నాట కాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సమగ్ర విచారణ చేసి అవినీతిలో భాగస్వాములైన రాజకీయ నాయకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాళేశ్వరాన్ని డ్రామేశ్వరంగా మారుస్తున్నారని, ప్రజల దృ ష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్ అంశాలను తరచూ తెరపైకి తెస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపించాలని మొట్టమొదట డిమాండ్ చేసింది బీజేపీయేనన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, రైతులకు ఉపయోగపడేలా చూడాలని డిమాండ్ చేశారు.
తాడిచర్ల రూ.64 వేల కోట్ల ఆదాయం..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టాయని, మోదీ సర్కార్ సంస్థకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టిందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 39 వర్కింగ్ మైన్స్ ఉండగా.. 31 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 41 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేశారు.
ఈ తరుణంలో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల- బ్లాక్‌ను కేటాయించడం పట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతు తెలిపారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్ ద్వారా.. సింగరేణి సంస్థకు రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుందని చెప్పారు. దాదాపు 1,200 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.
కాంగ్రెస్ అసత్య ప్రచారం..
తాడిచర్ల--2 బొగ్గు బ్లాక్‌ను తమ ప్రయత్నాల వల్లే సాధించుకున్నామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి ఎందుకు కేటాయించలేకపోయారో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమా ధానం చెప్పాలన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమష్టి కృషి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల మాత్ర మే సాధ్యమైందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని సొంత ప్రయోజనాలకు వాడుకోగా, కాంగ్రెస్ సర్కార్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ఇతర కార్యక్రమాలకు నిధులు మళ్లి స్తూ సంస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు కేటాయింపుల్లో భారీ స్కామ్ వెలుగుచూసిందని, మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని, పారదర్శకతకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఫలితంగానే నేడు కోల్ ఇండియా ద్వారా బొగ్గు ఉత్పత్తి సుమారు 70 శాతం పెరిగిందని, తద్వారా దేశానికి బొగ్గు రంగం నుండి దాదాపు రూ.2.5 లక్షల కోట్ల ఆదా యం సమకూరుతుందని రాంచందర్‌రావు వెల్లడించారు.






