ఇటు సూర్యుడు అటు మొలిచినా.. వచ్చేది కేసీఆర్ సర్కారే!
- ఎత్తు పొడవులపై కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడు రేవంత్ రెడ్డి
- సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల సాధన కోసం త్వరలో భారీ పాదయాత్ర
- అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపిస్తాం.,,
- ఆందోల్ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
సంగారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి) : ఇటు సూర్యుడు అటు మొలిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది మళ్ళీ కేసీఆర్ సర్కారేనని, భూమి బద్దలైనా తిరిగి అధికారంలోకి వచ్చే ది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మం త్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు స్పష్టం చేశారు. రైతులకు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే, దాన్ని కట్ చేసి 7-8 గ ంటలు మాత్రమే ఇచ్చేందుకు ’రైతు డిస్కం’ పేరుతో రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియో జకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పార్టీ సభ్య త్వ నమోదు, సర్ ఓటరు జాబితా సవరణ అవగాహన సదస్సులో హరీష్రావు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రికి చేతనైతే సబ్జెక్ట్ పై మాట్లాడాలి, ఎత్తు పొడవుల గురించి రేవంత్ రెడ్డికి ఎందుకు? పొట్టిగా ఉన్నోడికి పొడుగున్నోడిని చూస్తే ఈర్ష్య పుట్టడం సహజమే అన్నారు. ఏవి పాలు, ఏవి నీళ్లు అనేది ప్రజలకు మొత్తం అర్థమైంది.
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికా రంలోకి రావడం ఖాయం, వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీ కొడుకులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఆందోల్ ప్రాంత ప్రజలకు ప్రాణాధారమైన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను రే వంత్ రెడ్డి ఎందుకు బంద్ పెట్టిండో సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం బోరంచి అమ్మవారి దగ్గర నుంచి సిద్ధి వినాయక ఆలయం వరకు భారీ పాదయాత్ర చేద్దాం.
వర్షాలు తగ్గుముఖం పట్టగానే కార్యకర్తలు, నాయకులు పాదయాత్రకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ అంటే ఏమిటో బీఆర్‌ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాలని, లేకపోతే ఢిల్లీలో ఉండే బీజేపీ, రాష్ట్రంలో ఉండే ఓటుకు నోటు దొంగతో మన ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. విద్యార్థుల ఫీజు రీ యింబర్స్ మెంట్ పూర్తిగా బంద్ అయింది. రేవంత్ రెడ్డి విద్యార్థులపై చదువులకు దూ రం చేశాడని వాపోయారు.
రైతులకు ఇవ్వాల్సిన 19 వేల కోట్ల రూపాయల రైతు బం ధును రేవంత్ రెడ్డి దారుణంగా ఎగ్గొట్టాడు. రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణమాఫీ ఎక్కడా సరిగ్గా జరగలేదని తెలిపారు. కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తా మన్నారు.. ఈ కార్యక్రమంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






