ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ ఫలాలు
- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
- మండలంలో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చండ్రుగొండ, జులై 30,( విజయక్రాంతి ): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో విస్తృతం గా పర్యటించి రూ 1.25 కోట్ల అంచనా వ్య యంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.మంత్రి ముందు గా మంగయ్య బంజార గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి 24 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసిన ట్లు ప్రకటించారు. అనంతరం పొకలగూడెం గ్రామంలో రూ.60 లక్షల వ్య యంతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామానికి ఇప్ప టికే 77 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామంలో మిగిలిన అంతర్గత రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. తదుపరి రావికంపాడు గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.....ప్రజల సంక్షేమం, గ్రా మీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్నారు. ప్ర భుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 72 వేల ప్ర భుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ఇటీవల మరో 16 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం సహాయక సంఘాలకు రూ.70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక భద్రతా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఇందిరమ్మ గృహాల పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల గృహాలు, రెండో విడతలో మరో 2.50 లక్షల గృహాలు మంజూరు చేసి మొత్తం 7 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్,అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, పంచాయతీ అధికారి అనూష, గృహ నిర్మాణ శాఖ పిడి,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






