31 July, 2026 | 3:08 AM

ప్రణామ్ ప్రీవిలేజ్ కార్డును ఆవిష్కరించిన ఎమ్మెల్యే నవీన్‌యాదవ్

31-07-2026 01:59 AM

హాస్పిటల్ చొరవపై ప్రశంసలు

జూబ్లీహిల్స్, జూలై30 (విజయక్రాంతి): అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వృద్ధుల కోసం ప్రత్యేక కార్డును ప్రారంభించింది. ప్రణామ్ ప్రివిలేజ్ పేరిట రూపొందించిన ఈ కార్డు ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించింది. ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రివిలేజ్ కార్డును ఆవిష్కరించి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు.

వారి ఆరోగ్యా న్ని కాపాడేందుకు అస్టర్ ప్రైమ్ వైద్యులు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు. అనంతరం అస్టర్ ప్రైమ్ రీజనల్ సీఈఓ నిలేశ్ గుప్తా మాట్లాడుతూ ప్రివిలేజ్ కార్డుతో పెద్దలకు ప్రత్యేక వెసులుబాట్లు అందిస్తున్నా మన్నారు. హెల్త్ చెకప్ లపై రాయితీలు ఇస్తామన్నారు. ఓపీ, ఐపీ సేవల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తమ ఫార్మసీలో డిస్కౌం ట్ కూడా లభిస్తుందన్నారు. మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్, ఎమోషనల్ సపోర్ట్ అందిస్తామన్నారు. ఫిజియోథెరపీ సేవలు కూడా కార్డు ద్వారా అందుతాయన్నారు. ఏడాదికొకసారి ఉచితంగా కంటి, దంత పరీక్షలు వంటి ప్రయోజనాలు అం దించనున్న ట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అస్టర్ ప్రైమ్ క్లస్టర్ సీఈఓ హరికుమార్ రెడ్డి, ఏసీపీ రాఘవేంద్ర రావు, సీనియర్ సిటిజన్స్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.