జలాశయాల్లోకి వెళ్లొద్దు
- కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
- కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశం
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసినందున జిల్లాల్లో పోలీసులు వివిధ శాఖలతో సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లాకేంద్రాల్లో కంట్రోల్‌రూమ్ ఏర్పా టు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, జలాశయాల్లోకి ప్రజలను వెళ్ల కుండా అప్రమత్తం చేయాలని ఆదేశించా రు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం 20 టీఎంసీల నీరు చేరిందని, చుక్క నీరు వృథా కాకుండా చూడాలని అధికారులకు ఊచించారు.వరద ప్రభావిత ప్రాంతా ల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్య లు చేపట్టాలని మంత్రి సూచించారు.






