ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
రాజేంద్రనగర్, జూలై 30 (విజయక్రాంతి): అరె మైసమ్మ దేవాలయం దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ కు గురువారం కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరె మైసమ్మ దేవాలయం ముందు రోడ్డుకు మధ్యలో జిహెచ్‌ఎంసి అధికారులు 3 ఫీట్ల ఎత్తు కలిగిన డివైడర్ ను నిర్మిస్తున్నారని ఈ డివైడర్ నిర్మాణంతో ఆలయానికి వచ్చే భక్తులు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడవలసి వస్తుందని రోడ్డు ఇరువైపులా ఉన్న వివిధ కాలనీలా ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించడం వల్ల భక్తులకు వివిధ కాలనీలా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీనీ దృష్టిలో ఉంచుకొని( రోడ్డు దాటు బ్రిడ్జి )నీ ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.






