ఆరోగ్య సేవలకు కమాండ్ కంట్రోల్ రూం
మంచిర్యాల క్రైం, జూలై 30: వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా వైద్య ఆరోగ్యం పైన ప్రజల ఆరోగ్య రీత్యా అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి అందుబాటులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వెల్లడించారు. గురు వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ లకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేసిన అనంతరం ఆయన పలు సూచనలు చేశారు.
అత్యవసర సమయంలో ఆరోగ్య సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్ (9517225456)లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు విశ్వేశ్వర్ రెడ్డి, సుమన్, డెమో బుక్క వెంకటేశ్వర్, సిహెచ్‌ఓ కాకినాడ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది నీలిమ, సురేందర్, రవి, కిరణ్, రాజేష్, వసుమతి తదితరులు పాల్గొన్నారు.






