31 July, 2026 | 3:06 AM

సహాయక చర్యలను ముమ్మరం చేయండి

31-07-2026 01:58 AM
  1. అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
  2. గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణిలో వరద పరిస్థితిపై సమీక్ష

హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి) : వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఐటీ, ప రిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాల నీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యం లో గురువారం సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్‌కో సీఎండీ తదితర ఉన్నతాధికా రులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రామగుండం పారిశ్రామికవాడలో వరద నీరు వెళ్లేందుకు నాలాల్లో ఆటంకాలను తొలగించాలని సూచించారు.

వీర్లపల్లి గ్రామంలోకి వరద నీరు రాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించాలని, నివాసా లు జలమయమైన నేపథ్యంలో బాధితులకు పునరావాస చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామస్తులు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీచేసి, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. గోదావరిఖనిలో వరద తీవ్రత అధికంగా ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నాశారు. రామగుండంలో విపత్తు నివారణ బృందాలను  రంగంలోకి దించాలని సూచించారు. వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో 1,021 చెరువులు 80 శాతం నిండాయని, 2.7లక్షల ఎకరాలకు సాగునీరు అంద నుందని శ్రీధర్‌బాబు తెలిపారు.