వైభవంగా కళ్యాణ వేడుకలు
04-07-2026 02:17 AM
కేసముద్రం, జూలై 3 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలోని అమీనాపురం శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీమాన్ శ్రీ ఆరుట్ల హేమంత్ ఆచార్యుల బృందం ఆధ్వర్యంలో శ్రీవారి నవమ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం చతుస్థానార్చన, పూర్ణహుతి, శ్రీ స్వామి వారి వార్షిక శ్రావణ నక్షత్ర కల్యాణ మహోత్సవం అనంతరం తీర్థ ప్రసాద గోష్టి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
సాయంత్రం గంటలకు శ్రీ దేవి భూ దేవి సమేతంగా శ్రీవారి శోభా యాత్ర పట్టణ వీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం, చతుస్తనార్చన, వేద విన్న పాలు, నిత్యపూర్ణాహూతి, బలిహరణ, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు.






