15 July, 2026 | 12:54 AM

సర్కారు బడుల మూసివేత నిర్ణయం విరమించుకోవాలి

15-07-2026 12:54 AM

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు.

పెనుబల్లి జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యారంగం భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు. మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పెనుబల్లి మండల శాఖ నిర్వహించిన , క్యాంపెయిన్ లో భాగంగా వారు వివిధ పాఠశాలల్లో  వారు మాట్లాడుతూ విద్య రంగాన్ని,

కాపాడుకునేందుకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.  మేధావులు, ప్రజాసంఘాల నాయకులను ఏకం చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదని తెలియజేసినారు. ప్రభుత్వ బడుల మూసివేత ఆలోచన విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, మండల కమిటీ మిత్రులు కే సురేష్, కే సి హెచ్ రాము, తదితరులు పాల్గొన్నారు.