19 April, 2026 | 3:10 AM

బడంగ్‌పేట్‌లో ఆక్రమణల కూల్చివేతలు

19-04-2026 01:26 AM

బడంగ్‌పేట్, ఏప్రిల్ ౧౮ (విజయక్రాంతి): బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో జిహెచ్‌ఎంసి అధికారులు రోడ్లకు ఇరువైపుల రోడ్లను ఆక్రమించి వేసిన రేకుల షెడ్లు, ర్యాంపులు, డబ్బాలను తొలగించారు. ఉదయం ౬ గంటలకే శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ ఆధ్వర్యంలో బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ ఏసిపి కిరణ్ కుమార్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చెప్పారు. బాలాపూర్ చౌరస్తా నుంచి నాదర్ గుల్ ఏంవిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్డుకు ఇరువైపుల కూల్చివేతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కూల్చివేతలపై జోనల్ కమిషనర్ చంద్రకళ ను వివరణ కోరగా.. బడంగ్ పేట్, నాదర్‌గుల్ ప్రధానరహదారికి ఇరువైపుల రోడ్డును ఆక్రమించి వేసిన రేకుల షెడ్లు ర్యాం పులు, డబ్బాలు వంటివి తొలగిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ఆక్రమణతో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఆక్రమణలను తోగించినట్లు చెప్పారు. మూడు రోజుల క్రితమే ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న యజమానులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. కొందరు తొలిగించని ఆక్రమణలను కూల్చివేశామన్నారు.