2 May, 2026 | 4:07 AM

ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించాం

02-05-2026 02:57 AM
  1. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి
  2. జగిత్యాలలో ‘మే’ డే వేడుకల్లో మంత్రి అడ్లూరి

జగిత్యాల, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని, కార్మికులు సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో మం త్రి పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ,సింగరేణి కార్మికుల పోరాట ప్రటిమ మరువలేనిదని అన్నారు.

నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కనీసం చర్చలకు ఆహ్వానించలేదని,ప్రజలు మార్పు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించామన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రె స్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జగిత్యాల ఆర్టీసీ కార్మి కుల సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్,కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం..

బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు అంగవైకల్యానికి గురికాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభు త్వం ‘బాల భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ‘మే’ డే వేడుకలతో పాటు బాల భరోసా, నశముక్త్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ సున్నా నుంచి ఆరు ఏళ్ల వయసున్న చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి లోపాలు ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ అంది స్తామని మంత్రి తెలిపారు.