15 June, 2026 | 1:24 AM

రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు సాధించాం

15-06-2026 12:20 AM

జీరోబడ్జెట్ తో ఉన్నజిల్లా సంఘం 4.25 లక్షల నిలువ

భావి తరాలకు మార్గదర్శకులుగా నిలిచే విధంగా బైలా రూపొందించాం

కామారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలోనే కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘానికి ఉన్నతమైన గుర్తింపు సాధించడం. రాష్ట్రస్థాయిలో తెలంగాణ పద్మశాలి సంఘం ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించడం జరిగిందని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీ నరసయ్య అన్నారు.

ఆదివారం కామారెడ్డి ఇ ఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని 25 మండలాల నుండి నలుమూలల నుండి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవుల ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లా నుండి కామారెడ్డి జిల్లా గా ఏర్పడిన అనంతరం జిల్లా పద్మశాలి సంఘం బాధ్యతలు చేపట్టిన నాడు సంఘంలో ఒక్క రూపాయి కూడా లేదని అలాంటి సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి నేడు ప్రతి గ్రామంలో మండలంలో పద్మశాలి సంఘం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అంతేకాకుండా సంఘం పారదర్శకంగా ఉండేందుకు బైలాను రూపొందించడం జరిగిందని చెప్పారు. 4 లక్షల 25 వేల రూపాయలు సంఘం  భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు.835 మంది సంఘ సభ్యులతో జిల్లా సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రసంగంలో అన్నారు.3 సంవత్సరాల ఆరు నెలల కాలంలో చేపట్టిన సంఘంలోని సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలను సంఘాన్ని ఏకతాటిపై నడపడం అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో సంఘం ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో చెప్పుకోదగ్గ కార్యక్రమాలను కార్యవర్గం సహకారంతో ముందుకు సాగడం జరిగిందని వివరించారు.

భావితరాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శకాలను రూపొందించడం జరిగిందని భద్రత కోసం పెన్ డ్రైవ్ లో వేసి భద్రపరచడం రాష్ట్ర పద్మశాలి సంఘం లో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పద్మశాలి వర్గానికి చెందిన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారిని  శాలువాతో సన్మానించి మెమొంటో ద్వారా సత్కరించడం జరిగింది.  జిల్లా సంఘం ఎన్నికలను సంఘ నాయకులు న్యాయవాది జగన్నాథం నిర్వహించాలని కోరారు.

సంఘ ప్రధాన కార్యదర్శి బొమ్మెర రాజయ్య తన నివేదికను చదివి వినిపించారు. అలాగే సంఘం కోశాధికారి సబ్బనిధర్మపురి దాతల వివరాలను సంఘ సభ్యులను పేర్కొనడం వల్ల సంఘానికి వచ్చిన డబ్బు వివరాలను రసీదులతో  సహా వివరించారు. రాష్ట్రంలోనే కామారెడ్డి పద్మశాలి సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుని ఎంపిక కామారెడ్డి జిల్లాకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కలిసి మన ఐక్యతను చాటుదామని దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య అన్నారు.

భారతదేశానికి స్వతంత్రం సందర్భంగా జరిగిన పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జరిగిన ఉద్యమాల్లో పద్మశాలీల పోరాటo రావలసిన వాటా గురించి ప్రముఖ న్యాయవాది క్యాతం సిద్ధిరాములు వివరించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు వేయ్యి మంది పద్మశాలి కుల బాంధవులు హాజరయ్యారు. బాన్సువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, డివిజన్ అధ్యక్షులు తుమ్మ మచ్చేందర్, రామ్ చందర్, రాష్ట్ర లెక్చరర్ సంఘం అధ్యక్షుడు కాముని సుదర్శన్, కాలభైరవ స్వామి దేవాలయం అధ్యక్షుడు చింతల శంకర్, మాజీ అధ్యక్షులు చాట్ల రాజేశ్వర్, గోవర్ధన్ సబ్బని కృష్ణహరి, చౌకీ లక్ష్మీనారాయణ, రాజయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.